– 57మంది మృతి
– తాజా దాడుల్లో 30 మంది కన్నుమూత
– ఖాన్ యూనిస్‌లో మరో 11మంది
గాజా: గాజా స్ట్రిప్‌లో శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో 30 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని వైద్య వర్గాలు తెలిపాయి. దాడుల్లో చనిపోవడమే కాదు, ఆకలికి తట్టుకోలేక కూడా చాలా మంది మృతి చెందుతున్నారు. వారిలో చిన్నారులే ఎక్కువ సంఖ్యలో వుంటున్నారు. తాజాగా గాజా నగరానికి పశ్చిమాన ఉన్న రాంటీస్ ఆసుపత్రిలో సకాఫీ అనే ఒక బాలిక మృతి చెందినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇప్పటివరకు ఆకలితో మరణించిన వారి సంఖ్య 57కి చేరిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. తక్షణమే సరిహద్దులను తెరిపించి, ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఖాన్ యూనిస్ శరణార్ధ శిబిరంపై గత రాత్రి జరిగిన దాడిలో 11మంది చనిపోయారు. వీరిలో ఏడాది వయస్సులోపు వున్న ముగ్గురు శిశువులు కూడా వున్నారని గాజా పౌర రక్షణ దళం శనివారం తెలిపింది. శనివారం తెల్లవారు జామున 3గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 8మంది మరణించారని పౌర రక్షణ దళం ప్రతినిధి మహ్మద్ బసల్ తెలిపారు. హమాస్ సభ్యుడిని లక్ష్యంగా చేసుకునే తాము దాడి జరిపామని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి తెలిపారు.
గాజాలో ఆకలి కేకలు
- Advertisement -
- Advertisement -