నవతెలంగాణ – ముధోల్
తానూర్ మండలంలోని బోసి గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ మండల నాయకులు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు .తానూర్ మండలంలోని బోసి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం అన్నారు. చాకలి ఐలమ్మ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరలపైన విరోచితంగా పోరాటం చేసిన వీరవనిత అని పేర్కొన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోరిపోతన్న, మాజీ ఎంపిటిసి దేవోజీ భూమేష్, నాయకులు ధర్మపురి సుదర్శన్, తాటివార్, రమేష్, ధర్మపురి శ్రీనివాస్, మేత్రిసాయినాథ్ ,బత్తినోళ్ల సాయి, గంగాధర్, కాసారం శ్రీకాంత్, మోహన్ యాదవ్, జీవన్, లవన్, తదితరులు పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES