– కేంద్రంపై హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన ఉపాధి కూలీల పని దినాలను సగానికి తగ్గించడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. 2024-25లో 12.22 కోట్ల పనిదినాలను మంజూరు చేయగా, ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పని దినాలకే పరిమితం చేసిందని ఈమేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో ఎనిమిది మంది ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర సర్కారు చేస్తున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదని తెలిపారు. వెంటనే కేంద్రం పనిదినాలను పెంచాలనీ, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతు బీమా పథకం నిర్వీర్యం
రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన రూ.775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమని తెలిపారు. రుణమాఫీ హామీ విషయంలో కూడా సర్కారు మాట తప్పిందని విమర్శించారు. గడిచిన మూడు నెలల్లో సుమారు వంద మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వమే ఐదు లక్షలు చెల్లించాలనీ, పెండింగ్ ప్రీమియం కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి పనిదినాల తగ్గింపు శోచనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES