Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅరుదైన మెదడు వాపు వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతి

అరుదైన మెదడు వాపు వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక మృతికి అరుదైన మెదడు వాపు వ్యాధి అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ కారణమని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నిన్న ధృవీకరించారు. కలుషిత నీటిలో ఉండే అరుదైన “బ్రెయిన్ ఈటింగ్ అమీబా” వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

కోళికోడ్ జిల్లాలోని త‌మరస్సేరీకి చెందిన బాలిక జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఈ నెల 13న కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు కోజికోడ్ వైద్య కళాశాలలకు తరలించగా, అదే రోజు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి కారణంగా బాలిక మరణించిందని వైద్యులు స్పష్టంచేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad