నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని భారత్-పాక్ సరిహద్దుల్లో బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ ఒక పాక్ రేంజర్ ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దు దాటి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పట్టుకున్నట్టు తెలిపింది. అయితే పొరపాటున బార్డర్ దాటి వచ్చాడా, లేక ఉద్దేశ పూర్వకంగానే చొరబడ్డాడా అనే వివరాలపై అధికారులు పాక్ సైనికుడిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎల్ఓసీ వద్ద ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు అయితే ఉద్రిక్తతల వేళ చొరబాటు జరగడంతో ఆందోళన నెలకొంది. కాగా, పాక్ రేంజర్లు సైతం కొద్ది రోజుల క్రితం సరిహద్దు దాటిన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఫ్లాగ్ మీటింగ్ జరిగినప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్‌ను ఇంకా పాక్ విడిచిపెట్టలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
సరిహద్దులు దాటిన పాక్ రేంజర్..అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES