నవతెలంగాణ-హైదరాబాద్ : శనివారం సాయంత్రం మెడ్చల్, ఉప్పల్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఇటీవల ప్రారంభం అయిన చర్లపల్లి రైల్వే స్టేషన్ లో పైకప్పులోని ఓ భాగం ఒక్కసారిగా కూలి పోయి కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ది చేసింది. దీనిని మూడు నెలల కింద వర్చువల్‌గా ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే ఈదురు గాలులకు రైల్వే స్టేషన్ పై కప్పులోని బాగం విరిగిపడటంతో నిర్మాణ లోపం బయటపడటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూలిపోయిన పైకప్పు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES