నవతెలంగాణ – హైదరాబాద్: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌భుట్టోల ఎక్స్ అకౌంట్లు భారత్‌లో నిలిపివేయబడ్డాయి. ఏప్రిల్ 22న పెహల్గామ్ దాడి తర్వాత పాక్‌కి, భారత్‌కి మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే చట్టపరంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం వీరిద్దరివి మాత్రమే కాదు.. పలువురు పాకిస్తాన్ నటుల ఎక్స్ ఖాతాలు కూడా బ్లాక్ చేయడం జరిగింది. వారిలో ప్రముఖ నటులు హనియా అమీర్, మహిరా ఖాన్, అలీ జాఫర్‌ల ఎక్స్ ఖాతాలు ఉన్నాయి. అలాగే సనమ్ సయీద్, బిలాల్ అబ్బాస్, ఇక్ర అజీజ్, ఇమ్రాన్ అబ్బాస్, సజల్ అలీ వంటి నటుల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా నిలిపివేశారు.
ఇమ్రాన్‌ఖాన్, బిలావల్ భుట్టో ఎక్స్ అకౌంట్స్ భారత్‌లో బ్లాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES