- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పరిసర ప్రాంతాలలో గత నెల రోజులుగా సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు పట్టుబడింది. వర్సిటీ క్యాంపస్‌లోని కుక్కలు, జింకలపై దాడి చేసి చంపుతుండటంతో యూనివర్సిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నెల రోజుల క్రితమే వర్సిటీలోని పలు చోట్ల అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు క్యాంపస్‌లోని ఏడీ బిల్డింగ్ వెనుక ఫారెస్టు అధికారులు ఉంచిన బోనులో చిరుత చిక్కింది. దానిని అటవీ శాఖ అధికారులు ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.
- Advertisement -