Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పసుపు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

పసుపు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

– పసుపు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మహేందర్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా పసుపు పంట సాగులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల కేంద్రంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ సోమవారం రైతులకు సూచించారు.పసుపు తోటలు ప్రస్తుతం పెరుగు దశలో ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ నెలలో అధిక వర్షాల వల్ల పసుపు తోటలలో నీరు నిలిచి, అధిక తేమతో దుంప కుళ్ళు వచ్చే అవకాశముందన్నారు. రైతు సోదరులు తమ పసుపు తోటలలో నీరు నిలవకుండా చూసుకోవాలని సూచించారు.వర్షాలు ఆగిన తర్వాత 500 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా రోడోమైల్ ఎకరా భూమి తడిచేవిధంగా చల్లుకోవాలన్నారు. పసుపు మొక్కల ఆకులు తెల్లగా మారితే మల్టీ కె లేదా యూరియా 5గ్రాములు ఎకరా పంటలో పిచికారి చేసుకోవాలని తెలిపారు. పసుపు సాగులో ఏమైనా సందేహాలు ఉంటే మరిన్ని వివరాలకు పసుపు కేంద్రం కమ్మర్ పల్లి శాస్త్రవేత్తలను సంప్రదించాలని పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్  రైతులకు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad