నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశానుసారాం SIR సమయంలో బీహార్ ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఎస్ఐఆర్‌లో భాగంగా తొలగించబడిన పేర్ల వివరాలను ఆగస్టు 19 నాటికి బహిరంగ పరచాలని, ఆగస్టు 22 నాటికి సమ్మతి నివేదికను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. పోలింగ్ బూత్‌లలోని ‘ASD’ (గైర్హాజరు, బదిలీ చేయబడిన, చనిపోయిన) ఓటర్ల పేర్లను EC ప్రచురిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేసే అవకాశం ఉందని వారు తెలిపారు.
మరోవైపు ఎస్ఐఆర్ పై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ పెట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కానీ మోడీ ప్రభుత్వంలో చలనంలేదు. అదే విధంగా ఓట్ చోరీ పై తన పోరాటాన్ని రాహుల్ ముమ్మరం చేశారు. ఓట్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లో రెండో రోజు యాత్ర కొనసాగుతుంది.