నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో తర్వాత జాతీయ భద్రతపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయి పాకిస్థాన్ దేశంపై దౌత్యపరంగా పలు ఆంక్షలు విషయం తెలిసిందే. దేశ సరిహద్దు ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించి..నిఘా పెంచింది. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్‌తో ప్రధాని పలుమార్లు చర్చలు చేపట్టారు. అంతేకాకుండా ఇటీవల CCS సమావేశాన్ని ఏర్పాటు చేసి..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ప్రధాని మోడీతో ఎయిర్ ఛీప్ మార్షల్ ప్రత్యేకం భేటీకానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోహాల్ హాజరకానున్నారు. మరోమారు జాతీయ భద్రతా, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES