నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా బ్లాక్ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. తమిళనాడు డీఎంకే పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ పేరును ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇండియా బ్లాక్ లో డీఎంకే కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌డీయే తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని ఇండియా బ్లాక్ భావిస్తోంది.
కాగా, వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్‌డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఆదివారం వెల్లడించింది.