కవి, గాయకులు గోరటి వెంకన్న
నవతెలంగాణ దినపత్రికకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థి దశ నుంచే ప్రజాశక్తికి, పదేండ్ల నుంచి నవతెలంగాణకు నేను పాఠకున్ని, అభిమానిని. కార్పొరేట్ శక్తుల చేతుల్లో అక్షరం బందీ అయి అపసవ్య విలువలకు, పాలకుల స్వార్థ్య ప్రయోజనాలకు, పాత్రికేయ రంగాన్ని బంధిస్తున్న కాలంలో ప్రజలు యజమానులుగా, ప్రజల కోసమే ఆలోచించి, నిలబడి అద్భుతంగా ప్రజలకు చేరువైన పత్రిక నవతెలంగాణ. తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అభివృద్ధి, భారతదేశ సామాజిక పరిస్థితులు, దేశంలో పీడిత ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అగ్రరాజ్య సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలు, వాటి వల్ల చిన్నాభిన్నమైన ప్రజా జీవనాన్ని మార్చే ఉద్దేశంతో జరుగుతున్న పోరాటాలకు వేదికగా ఇది ముందుండి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నది.
ప్రజల చేతిలో ఆయుధం నవతెలంగాణకు శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES