Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఘ‌నంగా సింగ‌ర్ రాహుల్‌ సిప్లిగంజ్ నిశ్చితార్థం

ఘ‌నంగా సింగ‌ర్ రాహుల్‌ సిప్లిగంజ్ నిశ్చితార్థం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ‘కొత్త ఆరంభం’ అంటూ … గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ తన నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టిడిపి నేత, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కుమార్తె హరిణ్యా రెడ్డితో రాహుల్‌ నిశ్చితార్థం జరిగింది. కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

అయితే, తాజాగా తన ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోలను రాహుల్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. హైదరాబాద్‌ ఐటీసీ కోహినూర్‌లో జరిగిన ఈ వేడుక ఫొటోలను కోటంరెడ్డి శ్రీనివాసులు కూడా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాహుల్‌కు రూ.కోటి అందించిన సంగతి తెలిసిందే. ఓల్డ్‌ సిటీ నుంచి ‘ఆస్కార్‌’ వరకూ వెళ్లిన కుర్రాడంటూ రాహుల్‌ను ‘గద్దర్‌’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో సిఎం రేవంత్‌ కొనియాడారు. ‘కాలేజ్‌ బుల్లోడా’, ‘వాస్తు బాగుందే’, ‘రంగా రంగా రంగస్థలానా’, ‘బమ్మోలే ఉన్నదిరా పోరి’ లాంటి సినిమా పాటలు, ‘ఓ నా రాహులా’, బోనాలు, వినాయక చవితి తదితర స్పెషల్‌ సాంగ్స్‌తో రాహుల్‌ శ్రోతలను అలరించారు. ‘రంగమార్తాండ’తో నటుడిగానూ ఆకట్టుకున్నారు. కాలభైరవతో కలిసి రాహుల్‌ పాడిన ‘నాటు నాటు’ (ఆర్‌ఆర్‌ఆర్‌) పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad