Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఓట్ల చోరీలో బీజేపీ భాగ‌స్వామి ఈసీ: రాహుల్ గాంధీ

ఓట్ల చోరీలో బీజేపీ భాగ‌స్వామి ఈసీ: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఓట‌ర్ అధికార్ యాత్ర‌లో బీజేపీ, ఎన్నిక‌ల సంఘంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. పీఎం మోడీ, అమిత్‌షా, ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌జ‌ల రాజ్యాంగ హ‌క్కుల‌ను హ‌రిస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక హ‌క్కులో భాగ‌మైన ప్ర‌జ‌ల‌ ఓటు హ‌క్కును చోరీ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీహార్ రాష్ట్రంలో ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల పేర్ల‌ల‌ను స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ పేరుతో తొల‌గించార‌ని విమ‌ర్శించారు. ఓట‌ర్ అధికార్ యాత్ర ఇవాళ‌ బీహార్‌లోని న‌వాడ‌ ప‌రిధిలో మూడో రోజు ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది.ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఓట్ల చోరీ వ్య‌వ‌హారంలో బీజేపీ-ఎన్నిక‌ల సంఘం భాగ‌స్వామ్యం కొన‌సాగుతుంద‌న్నారు. ఓట‌ర్ జాబితా పేరుతో బీజేపీ, ఈసీ క‌లిసి ఓట్ల‌ను చోరీ చేస్తున్నాయ‌ని చెప్పారు. ఓటు హ‌క్కు ప్ర‌జ‌ల రాజ్యంగ‌పు హ‌క్కు, ఆ హ‌క్కు కోసం తామంత క‌లిసి పోరాటం చేయాల‌ని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక‌పై ఎవ‌రీ ఓటు చోరీ కానివ్వ‌మ‌ని,ప్ర‌జ‌ల ఓట్లు చోరీ కాకుండా త‌మ పోరాటం ఉధృతం చేస్తామ‌ని రాహుల్ గాంధీ అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad