సుల్తానాబాద్ నవతెలంగాణ
సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణా రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణా రావు మాట్లాడుతూ నవతెలంగాణ పుస్తక ప్రదర్శనలో ఎన్నో ఆసక్తికరమైన పుస్తకాలు ఉండడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మినుపాల ప్రకాష్ రావు, దామోదర్ రావు, చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్, శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, కుమార్ కిషోర్, సీపీఐ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ ,బుక్ హౌస్ జిల్లా ఇంచార్జ్ పురుషోత్తం సతీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
