- ఇస్రో చైర్మన్ డా.నారాయణ్ చేతుల మీదగా PH.D పట్టా స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్: ఇస్రో చైర్మన్ డా.నారాయణ్, ఓయూ వీసీ చేతుల మీదుగా చరిత్ర విభాగంలో PH.D పట్టాను కొరటికల్ వాసి డా. శిర్గమళ్ళ కిషోర్ అందుకున్నారు. మంగళవారం ఓయూలో జరిగిన స్నాతకోత్సవం సందర్భంగా PH.D పట్టాను శిర్గమళ్ళ కిషోర్‌కు వారు అందజేశారు.
మునుగోడు మండలం కొరటికల్ గ్రామ వాసి శిర్గమళ్ళ క్షేత్రయ్య-భాగ్యమ్మ కుమారుడు శిర్గమళ్ళ కిషోర్‌కు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ లో “తెలంగాణ సాయుధ పోరాటం లో దళితుల పాత్ర -(1946-1951)” అనే అంశం పై విశ్రాంత ఆచార్యులు కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకుగానూ ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం డాక్టరేట్ అందజేసింది.
కిశోర్ 1నుండి 7వ తరగతి వరకు కోరకటికల్ ప్రాథమిక పాఠశాలలో, 8నుండి 10వరకు మునుగోడు ZPHS స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్ లో ఇంటర్, డిగ్రీ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ చరిత్ర, తాజాగా PhD పూర్తి చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. పరిశోధన సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోదన పత్రాలు సమర్పించారు.
శిర్గమళ్ళకిషోర్ డాక్టరేట్ పొందిన సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ సోషల్ సైన్స్ డీన్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అర్జున్ రావు, ప్రొ. రామకృష్ణ-పద్మావతి అభినందనలు తెలియజేశారు. స్నేహితులు స్వామి, నాగరాజు, లష్మినారాయణ, రాజు, డా. విట్టల్, ఉదయరాణి, శరణ్య, పోతన, వెంకన్న తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు.