- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ ఆగంతకుడు దాడికి యత్నించాడు. ‘జన్ సువాయ్’ కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుడిలా వచ్చిన ఓ దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగంతకుడిని అదపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడిని 35 ఏళ్ల వయసు ఉన్న అహ్మద్ బాషాగా గుర్తించారు.

- Advertisement -