Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమాజీ చేవెళ్ల ఎంపీ ఇంట్లో ఐటీ దాడులు

మాజీ చేవెళ్ల ఎంపీ ఇంట్లో ఐటీ దాడులు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 24 గంటలుగా ఆరు కంపెనీల్లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో లింక్ ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, శ్రీనివాస ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు దాదాపు 25 గంటలుగా కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజామునే నాలుగు ఐటీ టీమ్స్ ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. అర్ధరాత్రి వరకు కూడా సోదాలు కొనసాగించగా, ప్రస్తుతం ఒక టీమ్ ఇంకా తనిఖీలు చేస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad