- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నైజీరియాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఉంగువాన్ మాంటా పట్టణంలో మసీదుపై కాల్పులు జరపటంతో 50 మందికి మృతిచెందారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగులు ఈ దాడి చేశారని ప్రజాప్రతినిధి అమీను ఇబ్రహీం తెలిపారు. కొన్ని గ్రామాలపై కూడా దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. దాడికి బాధ్యత వహిస్తున్నట్లుగా ఏ సంస్థ నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడలేదు.
- Advertisement -