- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా కలిశారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో గురువారం మర్యాదపూర్వంగా కలిశారు.గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా శుక్లా ISS కు ఆక్సియం-4 స్పేస్ మిషన్‌కు పైలట్‌గా ఉన్నారు. నాసా మిషన్ పూర్తి చేసిన తర్వాత జూలై 15న భూమికి తిరిగి వచ్చిన ఆయన ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధానిలో అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో మిషన్‌ను పూర్తి చేయడంలో గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా సాధించిన విజయాల ప్రాముఖ్యతను 2047 నాటికి ‘విక్షిత్ భారత్’ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్రను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు.
- Advertisement -