నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీజీ ఐసెట్ -2025 కు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీజీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్..
ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 22 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. 25 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 30న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్‌కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 2వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 2 నుంచి 5వ తేదీ మధ్యలో సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ ఫేజ్ షెడ్యూల్..
సెప్టెంబర్ 8న ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 9వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. 9 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 10వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్‌కు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 13వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుంది. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ మధ్యలో సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనున్నారు.