Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో సర్కార్‌ నిర్లక్ష్యం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో సర్కార్‌ నిర్లక్ష్యం

- Advertisement -

– మాజీ మంత్రి టి. హరీశ్‌రావు విమర్శ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు రూ. వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం విద్యార్థుల ఫీజు బకాయిలను ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. విద్యార్థుల చదువు ను, వారి జీవితాలను కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రశ్నా ర్థకం చేస్తున్నదని ఆరోపించారు. ”రాష్ట్ర వ్యాప్తం గా డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ.800 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో 6లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదముంది. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం. సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో పీజీసెట్‌, లాసెట్‌, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం, మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు” అని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా సగటున రూ. రెండు వేల కోట్ల చొప్పున తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తం రూ.19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విడుదల చేయ లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -