Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమోడీకి ఏజెంట్‌గా ఎన్నికల కమిషన్‌

మోడీకి ఏజెంట్‌గా ఎన్నికల కమిషన్‌

- Advertisement -

– ట్రంప్‌ టారిఫ్‌లపై దేశవ్యాప్త చర్చ
– ఎర్రకోట సాక్షిగా అమరవీరులకు అవమానం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్‌

ప్రజాస్వామ్యయుతంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి ఏజెంట్‌గా పని చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య విమర్శించారు. సీపీఐ(ఎం) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం రాత్రి మహ బూబాబాద్‌ జిల్లాలోని పెరుమాండ్ల జగన్నాథం భవన్‌లో స్మారక ఉపన్యాసం చేశారు. జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌ అధ్యక్షతన ‘రాజ్యాంగ విలువలు-ట్రంప్‌ టారిఫ్‌ దాడి-కేంద్ర ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో వీరయ్య మాట్లాడారు. భారతదేశంపై భారాలు వేస్తానని ట్రంప్‌ ప్రకటించినా మోడీ స్పందించక పోవడం శోచనీయమన్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఎర్రకోట సాక్షిగా మోడీ అమరవీరులను అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

మతోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతి రేకంగా.. ప్రజాస్వామ్య లౌకిక విలువలు, రాజ్యాంగం రక్షణ కోసం సీతారాం ఏచూరి పని చేశారని వీరయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం బీహార్‌లో ఓట్ల తొలగింపు, ఎన్నికల కమిషన్‌ వైఖరి, మాలేగా ఉగ్రవాద కుట్ర కేసులో నిందితు లకు క్లీన్‌చీట్‌ రావడం, ట్రంప్‌ అధిక పన్నులపై దేశంలో చర్చ జరుగుతోందని చెప్పారు. ట్రంప్‌ గెలుపు కోసం అమెరికా వెళ్లి మోడీ ప్రచారం చేశారని తెలిపారు. దేశంలో ధరలు, మహిళలు, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిపై చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై చర్చించకుండా ప్రధాని మోడీ ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ఉపన్యాసం లో ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి మాట్లాడి.. మహా పాపం చేశారని అన్నారు.

బీహార్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఎన్నికల కమిషన్‌ మార్పులు చేర్పుల పేరుతో 65,50,000 ఓట్లను తొలగిం చిందని, ఎందుకోసం తొలగించిందని ప్రశ్నించారు. కొండ కోనల్లో.. అడవుల్లో ఉన్న వారికి కూడా ఓటు హక్కు కల్పించడం కమిషన్‌ పని అన్నారు. అంతేగానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించడం కాదని విమర్శించారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ వారీగా సర్వే చేసి వారికి పడని ఓట్ల జాబితాలను తొలగించిందనే విమర్శలు వెలువెత్తుతున్నా యన్నారు. ఎన్నికల కమిషన్‌ కొత్తగా పౌరసత్వం అడుగుతుందని, పౌరసత్వానికి ఓటు హక్కుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చట్టం, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్‌ పని చేస్తోందని, ఇది రాజ్యాంగ మూల సూత్రాలకు ప్రమాదం అని అన్నారు.

బీహార్‌ ఓట్ల తారుమారుపై పార్లమెంట్‌లో చర్చించకుండా అడ్డదారుల్లో మూడు బిల్లులను పాస్‌ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఏదైనా కేసులో నెల రోజులకుపైగా జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా బిల్లు తెచ్చారని, ఇది బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విఘాతం కలిగించేలా ఉందని అన్నారు. అలాగే, మరో ఎంప్లాయిమెంట్‌ లింక్‌ స్కీం బిల్లు తెచ్చారని, ఇది కార్మికుల శ్రమ శక్తిని దోచుకునేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుణిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్‌ ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad