Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ప్రమాదవశత్తు జలపాతంలో పడి ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి

ప్రమాదవశత్తు జలపాతంలో పడి ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి

- Advertisement -

– మృతదేహాన్ని పంపించాలని కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వినతి
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్ అయిన లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ (25) అనే యువకుడు ఆగ్రా దగ్గర లో ఉన్న దమ్మ వాటర్ పాల్ లో ప్రమాదవశత్తు పడి మృతి చెందారు. పూర్తి వివరాల్లోకెళ్తే . న్యూఢిల్లీలోని వైమానిక దళంలో గత ఐదు సంవత్సరాలుగా లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్ జవాన్ గా పనిచేస్తున్నారు. అయితే వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తోటి స్నేహితులతో కలిసి ఆగ్రా దగ్గరలో ఉన్న ధమ్మ వాటర్ ఫాల్ కు వెళ్తున్నట్లు తండ్రి గంగాధర్ కు బుధవారం సమాచారం ఇచ్చాడు. అయితే సాయంత్రం వరకు కుమారుడి నుండి ఫోన్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం ఉదయం ఇండియన్ ఎయిపోర్స్ అధికారులు ఈశ్వర్ ప్రసాద్ గల్లంతయినట్లు తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. మళ్లీ మధ్యాహ్నం సమయంలో ఈశ్వర్ ప్రసాద్ వాటర్ ఫాల్లో గల్లంతే మృతి చెందాడని సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ,బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు సిలారం విజయ లక్ష్మి, గంగాధర్ లు వ్వవసాయ చేసుకుంటూ , కుమారుడిని చదివించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి పంపారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందటం కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానిక సీనియర్ నాయకులు నర్సగౌడ్ తో కలిసి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను గురువారం రాత్రి కలిశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి గ్రామానికి వచ్చే విధంగా చూడాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు .మృతదేహం స్వగ్రామానికి తొందరగా వచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో మంత్రి మంత్రి స్పందించారు. జవాన్ మృతదేహం ఇంటికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad