Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి..స్వగ్రామంలో విషాద ఛాయలు

ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి..స్వగ్రామంలో విషాద ఛాయలు

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మి ఈశ్వర్ ప్రసాద్( 25) అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆగ్రా దగ్గరలో ఉన్న దమ్మ వాటర్ఫాల్ లో పడి మృతి చెందారు. దీంతో జవాన్ స్వగ్రామమైన తరోడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎయిర్ ఫోర్స్ జవాన్ గా  పనిచేస్తూ, సెలవుల్లో స్వగ్రామానికి వచ్చినప్పుడు అందరితో కలుపుకోలుగా ఉండేవాడు. ఒకేసారి పిడుగు లాంటి వార్త వినిపించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, స్థానికులు కన్నీటి పర్వంతమయ్యారు. తల్లిదండ్రులు  ఆరుకాలం వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించారు. అయితే ఇంటికి పెద్ద దిక్కు అయినా పెద్ద కుమారుడు లక్ష్మి ఈశ్వరప్రసాద్ మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లల చదువు కోసం నిరంతరం వ్యవసాయ చేనులో కూరగాయల సాగులో ఆదర్శ రైతుగా తల్లిదండ్రులు సిలారం విజయలక్ష్మి, గంగాధర్ నిలిచారు. ఇప్పటికే కూతురు ఇండిగో ఎయిర్లైన్స్ లో ఉధ్యోగి గా పనిచేస్తున్నారు.చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు.అయితే పెద్ద కుమారుడైన ఈశ్వర్ ప్రసాద్ ఎయిర్ ఫోర్స్ జవాన్ గా పనిచేస్తు,  తాజాగా రెండు రోజుల క్రితం ఈశ్వర్ ప్రసాద్ ప్రమాదవశాత్తు జలపాతం లో పడి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు రోదనలు కంటతడి పెట్టిస్తున్నాయి. మృతదేహం  విమానంలో  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు శుక్రవారం రాత్రి వరకు రావచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad