నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఏడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా వానాలు దంచికొట్టాయి. శుక్రవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర జలమయమైయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వర్షాల కారణంగా సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్ ప్రాంగణంతో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు గణనీయంగా నిలిచిపోయింది. వరదల కారణంగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే స్టేషన్ మొత్తం వరద నీటితో నిండిపోవడంతో రైల్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు పలు రైలులను దారి మళ్లించి, ఆయా స్టేషన్ గుండా రైల్వే రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
నీటమునిగిన సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES