- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఐపీఎల్‌లో బిహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూశా. చిన్న వయసులో గొప్ప రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ప్రదర్శన వెనుక ఎంతో శ్రమ ఉంది’’ అని మోడీ అన్నారు. బిహార్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. వైభవ్‌ను కొనియాడారు. క్రీడాకారులు ఎంత ఎక్కువగా ఆడితే అంత బాగా మెరుగుపడతారని ప్రధాని అన్నారు. 14 ఏళ్ల వైభవ్ (రాజస్థాన్ రాయల్స్) గుజరాత్‌పై 35 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
- Advertisement -