Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

- Advertisement -
  • మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు

నవతెలంగాణ-మిరుదొడ్డి: రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని మీరుదొడ్డి మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు అన్నారు. శనివారం అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి రైతులు యూరియా కోసం బారలు తీరుతున్న రైతు పట్టించుకునే రాజకీయాలని అన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వ్య‌వ‌హ‌రించ‌డంతో ఎరువులు స‌కాలంలో పంపిణీ కావ‌డంలేద‌ని విమ‌ర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఎరువుల కొర‌త ఏర్ప‌డింద‌ని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు యూరియా కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రతి గ్రామానికి సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వల్లాల సత్యనారాయణ, నటబాబు రెడ్డి, హైమద్, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad