నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఈసీ చర్యను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఎనిమిదో రోజు యాత్ర ఆ రాష్ట్రంలో పూర్ణ జిల్లాలో కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఆదివారం మోటార్ సైకిల్ పై యాత్రను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజిస్వీయాదవ్ ప్రారంభించారు. ఇండియా బ్లాక్ కూటమి పార్టీశ్రేణులు భారీ యోత్తున పాల్గొన్నారు. ఈసీ ఓట్ల చోరీ ఉదంతంపై వాడవాడాలా తిరుగుతూ ప్రజలకు తెలియజేస్తున్నారు. దారి పొడవునా ప్రజలు నిలబడి ప్రతిపక్షనేతలకు స్వాగతం పలుకుతున్నారు.
ఈ యాత్ర పంచముఖి మందిర్, ఫోర్బ్స్‌గంజ్ రోడ్, హోప్ హాస్పిటల్ చౌక్, రాంబాగ్, కస్బా బజార్, జీరో మైల్ మీదుగా అరారియా చేరుకుంటుంది, అక్కడ రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీ మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు.