No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంరాజ‌స్థాన్‌లో నీటి మునిగిన ‘దౌసా’

రాజ‌స్థాన్‌లో నీటి మునిగిన ‘దౌసా’

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఇటీవ‌ల ఉత్త‌ర‌భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురిసిన విష‌యం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాలకు వ‌ర‌ద నీరు పొటెత్తి..ప‌లు కాల‌నీలు నీట మునిగాయి. ఈ సారి రాజ‌స్థాన్‌లో కూడా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప‌లు ప్రాంతాలు వ‌ర‌ద‌నీటిలో మునిగిపోయాయి. దౌసా జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్లు నదులుగా మారాయి. జైపూర్ రోడ్డు వెంబడి ఉన్న సర్వీస్ లేన్ పూర్తిగా మునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం రెండు అడుగుల వరకు చేరుకుంది. దీంతో ఆయా ప్రాంతాల‌కు రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డింది. లాల్సోట్ బైపాస్ కల్వర్ట్ నీటితో నిండిపోయింది, రోడ్డుపై పగుళ్లు కనిపించడం వల్ల ప్రయాణానికి మరింత ఇబ్బందిగా మారింది. మ‌రోవైపు రానున్న 24గంట‌ల్లో భారీ వర్షాలు ప‌డ‌నున్నాయ‌ని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నిన్న మాధాపూర్ రైల్వే స్టేష‌న్ నీట‌మునిగిన విష‌య తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad