నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు రెండో వన్డే గ్రేట్ బారియర్ రీఫ్‌లో ఉదయం ప్రారంభం అయింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసిస్ ఓపెనర్లు హెడ్, మార్ష్, గ్రీన్ చలరేగి ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లపై విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా హెడ్ 103 బంతుల్లో 17 ఫోర్లు 5 సిక్సర్లతో 142 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ మార్ష్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులకు అవుట్ అయ్యాడు. అనంతరం మూడో వికెట్ కు క్రీజులోకి వచ్చిన గ్రీన్ ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో అతను కేవలం 55 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో 118* చేశాడు. అలాగే చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన అలెక్స్ కారీ 50 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 431 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా భారీ స్కోరు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES