- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ, భాజపా మధ్య భాగస్వామ్యం ఉందన్నారు. 8వరోజు ఓటర్ అధికార యాత్రలో భాగంగా బిహార్‌లోని అరారియాలో రాహుల్ పర్యటించారు. ‘‘లక్ష మంది నకిలీ ఓటర్లు ఎలా వచ్చారనే దానిపై ఈసీ స్పందించట్లేదు. ఓట్ల చోరీ వ్యాఖ్యలపై అఫిడవిట్ ఇవ్వాలని నన్ను అడుగుతోంది. ఇదే విషయంపై అనురాగ్ ఠాకూర్ మాట్లాడితే అఫిడవిట్ కోరలేదు. ఈసీ ఎవరికి మద్దతుగా నిలుస్తోందో తెలుస్తోంది. తటస్థంగా ఉంటే ఆయన నుంచి కూడా అఫిడవిట్ కోరేవారు’’ అని రాహుల్ అన్నారు.
- Advertisement -