Monday, May 5, 2025
Homeక్రైమ్పిల్లలకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య

పిల్లలకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. మృతులు మారిన్ (13), ఆరాధ్య (10), సుభాష్ (42)లుగా గుర్తించారు. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న మనస్తాపంతోనే సుభాష్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -