నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయిల్ సైన్యం గాజాపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 20 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మరోవైపు గాజాలో ఆహార సరఫరాను ఇజ్రాయిల్ సైన్యం నిలిపివేసింది. దీంతో ఆకలికి తట్టుకోలేకే చాలామంది చనిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి వినతి మేరకు ఇజ్రాయిల్ సైన్యం కేవలం.. గాజాలో సైనిక శిబిరాలకు మాత్రమే ఆహారాన్ని సరఫరా చేస్తామని చెప్పడంతో.. ఇజ్రాయిల్ ప్రమాదకరమైన వ్యూహంపై ఐక్యరాజ్యసమితితోపాటు పలు మానవతా సంఘాలు కూడా ఖండించాయి. కాగా, గాజాలోని తాజా పరిస్థితులపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, ఇద్దరు కేబినెట్ మంత్రులతోనూ, ఇజ్రాయిల్ జనరల్ స్టాఫ్ చీఫ్‌తోనూ ఈరోజు సమావేశం కానున్నారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
గాజాపై ఇజ్రాయిల్ దాడి.. 20 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES