నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చి పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం ఆయన పాకిస్తాన్‌కు చేరుకున్నారు. భారత్‌లో పర్యటనకు ముందు ఆయన పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని హెహబాజ్ షరీఫ్, ఉప ప్రధాని మహ్మద్ ఇరాక్ దార్‌లతో అరాగ్చి చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను కూడా మార్పిడి చేసుకోనున్నాయి. పాకిస్థాన్, ఇరాన్‌ల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అరాగ్చి పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, సహకారాన్ని పెంచుతుందని ఆ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌కుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ దేశాలతో ఇరాన్ కొనసాగిస్తున్న సంప్రదింపులలో భాగంగా విదేశాంగ మంత్రి అరాగ్చి పార్ మరియు భారత్‌లలో పర్యటించనున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై శనివారం ప్రకటించారు.
పాకిస్థాన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES