Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విషాదం..8మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విషాదం..8మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఉత్త‌ర‌ప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను రహదారిపై నుంచి తొలగించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా రాఫత్‌పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఒక ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి బయలుదేరార‌ని పోలీసులు తెలిపారు. బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దులోని జాతీయ రహదారి-34పై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad