నవతెలంగాణ – హైదరాబాద్ : గాజాపై దాడులను విస్తరించేందుకు ఇజ్రాయిల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గాజాలో హమాస్‌పై దాడిని క్రమంగా విస్తరించేందుకు ప్రధాని నెతన్యాహూ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సంబంధిత వివరాల గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయిల్ మీడియా సోమవారం వెల్లడించింది. గాజాలో సాయం అందించేందుకు కొత్త ప్రణాళికను క్యాబినెట్ ఆమోదించిందని తెలిపింది. అయితే సాయాన్ని ఎప్పుడు అనుమతిస్తారు అనే అంశంపై స్పష్టత లేదు. ఇప్పటికే భద్రతా దళాలను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఐయాల్ జమీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైన్యంలో చేరాల్సిందిగా పది నుండి వేలకు పైగా పౌరులకు ఆదేశాలను పంపామని అన్నారు. తమ బందీలను వెనక్కి రప్పించడం, హమాస్‌ను ఓడించడం లక్ష్యంగా ఒత్తిడిని మరింత పెంచుతున్నామని జమీర్ దళాలకు చెప్పినట్లు సైన్యం ఆ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయిల్‌లోని ప్రధాన విమానాశ్రయం టెల్‌అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంపపై ఆదివారం ఉదయం యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి జరిపిన అనంతరం ఇజ్రాయిల్ కేబినెట్ సమావేశమైన సంగతి తెలిసిందే.
గాజాపై దాడుల విస్తరణకు ఇజ్రాయిల్ క్యాబినెట్ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES