Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీలో మెట్రో చార్జీల మోత‌

ఢిల్లీలో మెట్రో చార్జీల మోత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆప్ ప్ర‌భుత్వాన్ని ఓడించి ఢిల్లీ పిఠాన్ని ఎక్కిన బీజేపీ ప్ర‌భుత్వం చార్జీల మోత మోగించింది. మెట్రో రైలు చార్జీలను పెంచుతున్నట్లుగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) వెల్లడించింది. పెంచిన మెట్రో రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణ రోజులు 2 కి.మీ ప్రయాణానికి రూ.10గా ఉన్న చార్జీని రూ.11 చేశారు. ఇక 12 నుంచి 21 కి.మీ రూ.40 ఉండగా.. రూ.43కు, 21 నుంచి 32 కి.మీ: రూ.50 ఉండగా రూ.54కు, 35 కి.మీ పైగా ప్రయాణానికి గతంలో రూ.60 ఉండగా.. రూ.64 పెంచారు. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ రూట్లో ధరలు రూ.5 వరకు పెరిగినట్లుగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad