Monday, August 25, 2025
E-PAPER
spot_img
HomeNewsఉత్తమ విద్యకు చిరునామ కృష్ణవేణి విద్యాసంస్థలు

ఉత్తమ విద్యకు చిరునామ కృష్ణవేణి విద్యాసంస్థలు

- Advertisement -

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఆడిటోరియం ప్రారంభోత్సవంలో కృష్ణవేణి, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

నవతెలంగాణ – పటాన్ చెరు:విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో కృష్ణవేణి విద్యాసంస్థలు ఉత్తమ విద్యకు చిరునామ గా నిలుస్తున్నాయని కృష్ణవేణి విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని పేర్కొన్నారు. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ నాగరాజు ఆధ్వర్యంలో  కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని ముఖ్య అతిథిగా పాల్గొని ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల లో గణపతి పూజ, లక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యను అందిస్తూ తెలుగు రాష్ట్రాలలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్, ది మాస్టర్ మైండ్స్ స్కూల్స్ నడుపుతున్నామని చెప్పారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేట్ సిస్టంతో సీబీఎస్సీ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి కోర్సులను కొనసాగించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చదువులో మెలుకువలు నేర్పుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. రోజువారీగా విద్యార్థులకు చదువు డెవలప్ కావడానికి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నామని, చదువుతోపాటు లైఫ్ స్కిల్స్ అందిస్తున్నట్లు చెప్పారు.మంచి గ్రామర్ తో ఇంగ్లీష్ లో సీఎల్డీపి ప్రోగ్రాం చేపడతామని చెప్పారు.6 నుండి 10 వరకు విద్యార్థులకు ఐఐటి, మెడికల్ ఎంట్రన్స్ పైన ఫోకస్ పెట్టడం జరుగుతుందని తెలిపారు. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ పటాన్ చెరు పారిశ్రామిక వాడలో సామాన్య మధ్యతరగతి పిల్లలే ఎక్కువగా ఉంటారని వారిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ప్రత్యేక కృషి జరుగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రిన్సిపాల్ ప్రసన్న కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad