- – కార్యాలయంలో కుప్పలుతెప్పలుగా లైసెన్స్ కార్డులు
నవతెలంగాణ-బెజ్జంకి:జిల్లా ఆర్డీఓ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.వాహనదారులకు లైసెన్స్ కార్డులందించడంలో బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు.వాహనదారులు తమ లైసెన్స్ కార్డుల కోసం గత ఏడాదిగా ఎదురుచూస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అపవాదులు వినిపిస్తున్నాయి. వాహనదారులకు లైసెన్స్ కార్డులందించడంలో బాధ్యతలేకుండా వ్యవహరించడం వల్ల కార్యాలయంలో లైసెన్స్ కార్డులు కుప్పలుతెప్పులుగా పెరుకుపోయాయి. వాహనదారులు తమ లైసెన్స్ కార్డులను కార్యాలయంలో వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని మండలంలోని పలువురు వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యం వీడీ వాహనదారులకు లైసెన్స్ కార్లులను అందించాలని పలువురు వాహనదారులు కొరుతున్నారు.