నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని టీఎంసీ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారమే దాడులు నిర్వహిస్తోందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. శాసనసభ్యుడికి ఈ దాడి గురించి తెలియగానే, ఆయన ప్రాంగణంలోని సరిహద్దు గోడను దాటి తన ఇంటి నుండి పారిపోవడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. “ఎమ్మెల్యేను సమీప ప్రాంతంలో మా అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఇప్పుడు మా అధికారులు అతన్ని విచారిస్తున్నారు” అని ఈడీ అధికారి పిటిఐకి తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించి బిర్భూమ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చేసిన లావాదేవీ గురించిన సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ స్కామ్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ గతంలో సాహా భార్యను ప్రశ్నించింది.
టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES