- Advertisement -
– డిసిసిబి చైర్మన్ ఎం విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ- ఆత్మకూరు : మన రాష్ట్రానికి అదనంగా 50 వేల టన్నుల యూరియా ప్రభుత్వం మంజూరు చేయుటకు అంగీకరించిందని మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ ఎం విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని పిఎసిఎస్ ను సందర్శించారు .ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల యూరియా సరఫరా కావడం లేదని ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమేనని, దీనికి అసలు కారణం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల ఎకరాల భూమి సాగు చేస్తున్నారని ,దాంట్లో 1,60,000 పొలాలకు గాను దాదాపు 50 ,60 లక్షల ఎకరాలు వరి సాగు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -