- Advertisement -
నవతెలంగాణ గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాలలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులకు డాక్టర్ సారిక ఫిజియోథెరపీ చేశారు. వీరికి ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయించాలని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. ఇలాంటి పిల్లలకు ఏకైక వైద్యం ఫిజియోథెరపీయే అని వారు తెలిపారు. మండల కేంద్రంలోని దివ్యాంగులు రేపు జరగబోయే నిర్ధారణ శిబిరానికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య, సాయన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు భవాని దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
- Advertisement -