– వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం శూన్యం
– వ్యాయామ ఉపాధ్యాయుడు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
– వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుని ఏర్పాటు చేయాలని పాఠశాల ముందు ధర్నా
నవతెలంగాణ – కామారెడ్డి : అధికారులు తమ పాఠశాల గురించి పట్టించుకోవడంలేదని కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ముందు విద్యార్థిని విద్యార్థులతో కలిసి పూర్వ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా ఇక్కడ పనిచేసే పీఈటీ శివరామ్ అనే పీఈటీ ఉపాధ్యాయున్ని డిప్యుటేషన్ మీద హైదరాబాద్ పంపించారన్నారు. రెండున్నరేళ్లుగా వ్యాయమ ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ పై హైదరాబాదులో పనిచేస్తున్నాడనీ, చిన్న మల్లారెడ్డి గ్రామ పాఠశాల నుండి వేతనం పొందుతూ అక్కడ తన విధులు నిర్వహిస్తున్నారన్నారు. దీనివలన చిన్న మల్లారెడ్డి గ్రామ పాఠశాల విద్యార్థులు క్రీడలు లేక చాలా నష్టపోతున్నారు. ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరుపునుండి గత మూడు నెలల నుండి అధికారులను, కలెక్టర్ ను, డిఇఓ ను కలిసి విన్నవించిన ఎలాంటి ఫలితం కనబడడం లేదన్నారు. భవిష్యత్తులో విద్యార్థులలో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలిగి ఉండాలంటే క్రీడా ఉపాధ్యాయుడు అవసరం ఉందన్నారు. కావున మా గ్రామ పాఠశాలలో నియమింపబడిన ఉపాధ్యాయుడు ఇక్కడనే పనిచేసే విధంగా అన్ని పార్టీల అధ్యక్షులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలనీ కోరుతున్నామన్నారు. వెంటనే అతని డిప్యూటేషన్ రద్దు చేసి మా ఉపాధ్యాయున్ని మాకు పంపించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తొ పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అధికారులు మా పాఠశాలను పట్టించుకోవడం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES