నవతెలంగాణ -ముధోల్ : గణేష్ నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని ముధోల్ సిఐ మల్లేష్ కోరారు. ముధోల్ పోలిస్ స్టేషన్ ఆవరణలో సోమవారం రోజున నిర్వహించిన మండల శాంతికమిటి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదు ,ఏడు, తొమ్మిది రోజుల కు నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. గణేష్ మండపల వారు ఆన్లైన్ లో అనుమతి పొందాలన్నారు.డిజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి అనుమతి ఉంటుందన్నారు. నిమజ్జనం రోజు పోలిసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య మీ దృష్టికి వచ్చిన వెంటనే పోలిసులకు తెలిపాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ బిట్ల పెర్సిస్,హిందు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రోళ్ళ రమెష్,మాజీ ఎంపిపి ఎజాజుద్దిన్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి,బిడిసి అధ్యక్షుడు విఠల్, మాజీ సర్పంచ్ బోయిడిఅనిల్, నాయకులు పతంగి కిషన్,పోతన్న యాదవ్,ఖాలిద్ పటేల్, ఆయా మండపల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES