-పోలీస్ శాఖ క్రీడల ప్రారంభోత్సవంలో ఏసీపీ రవీందర్ రెడ్డి
-సమాజాభివృద్ధికి కృషి..జన్మకే పరమార్థం:ఎస్ఐ
నవతెలంగాణ-బెజ్జంకి : సామాజిక స్పృహ కలిగియుండడం..గొప్ప వరమని నేటి రోజుల్లో సమాజంపై మాదకద్రవ్యాలు చూపుతున్న చెడు ప్రభావాన్ని నివారించడానికి అందరూ పాటుపడాల్సిన అవశ్యకత ఉందని ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు.యువతపై మాదకద్రవ్యాలు ప్రభావం చూపకుండా మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను సోమవారం ఏసీపీ మోతె రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. క్రీడలతో చెడు ఆలోచనలు దరిచేరవన్నారు.యువత నిత్యం క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు.మాదకద్రవ్యాలు యువతపై చెడు ప్రభావం చూపుతున్నాయని..వాటిని అరికట్టాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీస్ శాఖ నిర్వహిస్తున్న క్రీడలను యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సమాజాభివృద్ధికి కృషి..జన్మకే పరమార్థం: ఎస్ఐ సౌజన్య
సాధారణ జీవనంతో పాటు సమాజాభివృద్ధికి కృషి చేస్తూ జీవనం సాగించడం మానవ జన్మకే పరమార్థమని ఎస్ఐ సౌజన్య సూచించారు.యువత ఆలోచనలు సమాజంపై ప్రభావం చూపుతాయని.. మాదకద్రవ్యాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. మాదకద్రవ్యాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని యువత పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.పోలీస్ శాఖ నిర్వహిస్తున్న క్రీడల్లో యువత ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో మండలానికి పేరప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఠాణా సిబ్బంది,అయా గ్రామాల యువత పాల్గొన్నారు.
సామాజిక స్పృహ గొప్ప వరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES