నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ వివరాలను వెల్లడించాలంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి కేంద్ర సమాచార కమిషన్ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న రిజర్వ్ చేసిన తీర్పును జస్టిస్ సచిన్ దత్తా నేడు వెలువరించారు.
నీరజ్ అనే వ్యక్తి ప్రధాని మోడీ డిగ్రీ వివరాల కోసం సమాచార హక్కు చట్టం (RTI) కింద సీఐసీకి దరఖాస్తు పెట్టారు. ప్రధాని 1978లో బీఏ పూర్తి చేశారు. దీంతో ఆ ఏడాది బీఏ పరీక్షలో ఉత్తీర్ణులైనవారి రికార్డుల తనిఖీకి 2016 డిసెంబరులో ప్రధాన సమాచార కమిషనర్ అనుమతించారు. దీన్ని డీయూ సవాలు చేయగా.. 2017 జనవరిలో ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
తెలుసుకునే హక్కు కన్నా వ్యక్తిగత గోప్యతా పరిరక్షణ హక్కు మిన్న కాబట్టి.. సీఐసీ ఉత్తర్వును కొట్టివేయాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రధాని మోడీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించడానికి యూనివర్సిటీ సిద్ధంగానే ఉన్నా.. ఆర్టీఐ కింద ఈ వివరాలను అపరిచితులతో పంచుకునేందుకు సుముఖంగా లేదని తెలిపారు.
మోడీ డిగ్రీ వ్యవహారం.. ‘సీఐసీ’ ఆదేశాలను పక్కనపెట్టిన ఢిల్లీ హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES