Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవిద్యుత్ భద్రతా నియమాలకు లోబడి గణేష్ మండపాలు 

విద్యుత్ భద్రతా నియమాలకు లోబడి గణేష్ మండపాలు 

- Advertisement -

– గృహ జ్యోతి ఉచిత విద్యుత్ వ్యయం రూ.1.80 కోట్లు  
– వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల ప్రస్తుత వినియోగ సామర్ధ్యం తెలియజేయాలి
– ఎన్పీడీసీఎల్ డీఈ నందయ్య
అశ్వారావుపేట – నవతెలంగాణ 
: గణేష్ ఉత్సవ కమిటీలు విద్యుత్ భద్రతా నిబంధనలకు అనుగుణంగా గణపతి మండపాలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ నందయ్య అన్నారు. స్థానిక సబ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. విద్యుత్ లైన్ లకు దూరంగా,నిర్ణీత ఎత్తులో,లోకల్ ఎర్తింగ్ తో,నాణ్యమైన,జాయింట్ లు లేని విద్యుత్ సరఫరా వైర్ లు,పటిష్టమైన టేకింగ్ తో,ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న ఇనుప తువ్వాలుతో 12 అడుగుల వెడల్పు,20 అడుగుల ఎత్తులో మాత్రమే మండపం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.మండపాల విద్యుత్ వినియోగం సామర్ధ్యం సైతం తెలియజేయాలి అన్నారు.

పాల్వంచ విద్యుత్ డివిజన్ లోని రెండు 8 సెక్షన్ లు,నాలుగు మండలాల పరిధిలో రూ.35 కోట్లు విద్యుత్ బకాయిలను ఉన్నాయని,ఇందులో ప్రైవేట్ వినియోగ దారుల నుండి వందశాతం,ప్రభుత్వ శాఖల నుండి 40 శాతం తగ్గకుండా బకాయిలు వసూలు చేయడానికి కార్యాచరణ చేపట్టాం అన్నారు.

డివిజన్ పరిధిలో మొత్తం గృహ జ్యోతి వినియోగదారులు మొత్తం 76827 మంది ఉండగా ఇందులో 42780 మంది గృహ జ్యోతి పధకానికి అర్హులు అని ఈ నెల 39819 మందికి గృహ జ్యోతి లబ్ధిదారులకు రూ.1 కోటి 80 లక్షలు వ్యయం ప్రభుత్వం భరించింది అన్నారు.

వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులు విద్యుత్ కనెక్షన్ పొందిన నాటి విద్యుత్ వినియోగ సామర్ధ్యం,ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్ సామర్ధ్యాన్ని నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఆయన వెంట ఏఈ రవికుమార్ ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad