- Advertisement -
-టీఎంఎల్ మేళాలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-బెజ్జంకి : విద్యార్థులకు విద్యా సామార్థ్యాలను పెంపోందించడానికి టీఎంఎల్ దోహదపడుతుందని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఎంఎల్ మేళాను డీఈఓ సందర్శించి విద్యా ఉపకరణాలను పరిశీలించారు. ప్రమాణికమైన విద్యను అందించడానికి బోధనలో ఉపాధ్యాయులు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని డీఈఓ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు క్రీడల దుస్తులను పంపిణీ చేశారు.ఎంఈఓ,మండలంలోని అయా గ్రామాల పాఠశాలల బోధన సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -